ED Notice to Malla Reddy | మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు !
ED Notice to Malla Reddy | మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు !
వెంటనే షాక్ కు గురైన మల్లారెడ్డి
నాకెలాంటి సంబంధం లేదంటు ప్రకటన
తన కొడుక్కి నోటీసులు వచ్చాయంటూ క్లారిటీ
Hyderabad : రాష్ట్ర మాజీ మంత్రి (బీఆర్ఎస్ నేత ) చామకూర మల్లారెడ్డికి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుహ్యంగా నోటీసులు జారీ చేసినట్లు పుకార్టు షికారవుతున్నాయి. అయితే పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు గురువారం మల్లారెడ్డికి నోటీసులు అందజేశారు. పోయిన సంవత్సరం జూన్ నెలలో మల్లారెడ్డికి చెందిన 12 కళాశాలల్లో అధికారులు దాడులు చేశారు. అయితే ఈడీ సోదాల్లో కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే పీజీ మెడికల్ కాలేజీలలో సీట్లు అక్రమంగా బ్లాక్ చేసినట్లు గుర్తించారు. తెలంగాణలోని 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 45 సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి, వాటిని కోట్ల రూపాయలకు దొడ్డి దారిలో అమ్ముకున్నట్లు ఈడీ విచారణలో తేల్చింది. అయితే ఇందుకు సంబంధించి అధికారులు మల్లారెడ్డిని వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. ఈడీ మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించంది. ఈ సందర్భంగా లెక్కల్లోకి రాని రూ.1.40 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. కాలేజీకి సంబంధించిన అకౌంట్లలో రెండు కోట్ల రూ. 89 లక్షలు నగదు కూడా ఈడీ అధికారులు సీజ్ చేసినట్లు చెప్పుతున్నారు. గత 2022 ఏప్రిల్‌లో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పీజీ సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి అమ్ముకున్నారని హెల్త్ యూనివర్సిటీకి చెందిన అధికారులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
* నాకేలాంటి సంబంధం లేదు : మాజీ మంత్రి మల్లారెడ్డి..
మెడికల్ కాలేజీల పీజీ సీట్ల కుంభకోణంలో ఈడీ జారీ చేసిన నోటీసులు అందాయంటూ వస్తున్న మీడియా కథనాలపై మల్లారెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులకు సంబంధించి తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈడీ నుంచి తనకెలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు. అయితే తన కొడుక్కి మాత్రం ఈడీ నోటీసులు అందాయని తెలిపారు. గతంలో తనపై ఈడీ రైడ్స్ జరిగాయని, వాటి విచారణకు రమ్మంటారు అని, ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్‌లో భాగమే అవుతుందని, దీనినే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఈడీ మాత్రం మెడికల్ పీజీ సీట్ల వ్యవహారంతో మాత్రం దర్యాప్తును మాత్రం వేగవంతం చేసినట్లు సమాచారం. అందుకే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి ఈడీ నోటీసులు పంపినట్లు సమాచారం.
* * *
Leave A Comment